కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం : సర్పంచ్ అజ్మీర రఘురాం నాయక్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ రఘురాం నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని గారెపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారాన్ని కాటారం కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు మంత్రి నరేష్ తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురాం నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి తెలియపరచి, టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడమే తమ లక్ష్యం అన్నారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయకపోగా ప్రజలు కోరుకున్న ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని ప్రగల్భాలు పలకడం పరిపాటిగా మారిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరితమైన మాటలు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీని శ్రీధర్ బాబుని గెలిపించాలని కోరారు.
1 thought on “కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం : సర్పంచ్ అజ్మీర రఘురాం నాయక్”