ఎమ్మెల్యే పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి బిజెపిలో చేరిక
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: మంథని శాసనసభ నియోజకవర్గంలో వినూత్న రీతిలో ప్రచార పర్వం కొనసాగుతోంది. మంగళవారం కాటారం మండలం గుమ్మల్లపల్లిలో వింతైన సంఘటన చోటుచేసుకుంది. గతంలో మంథని శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మ బాపిరెడ్డి బిజెపిలో చేరారు. మంథని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బాపిరెడ్డి కాషాయ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రజలకు వివరించేందుకు చైతన్య యాత్ర కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, మండల మోర్చా అధ్యక్షులు కొలుగూరి రవీందర్, మండల కార్యదర్శి పూసల రాజేంద్ర ప్రసాద్ , వేముల లింగయ్య, మహా దేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి సూరం మహేష్ రెడ్డి తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.