ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మమన్ యాదవ్
ములుగు, తెలంగాణ జ్యోతి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మేడుదుల మమన్ యాదవ్ ఎన్నికైయ్యారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆద్వ ర్యంతో ఢిల్లీలోని డీడీ మైదానంలో జరుగుతున్న 69వ జాతీయ మహాసభలలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ములుగు జిల్లా ములుగు మండలం కాసిందేవిపేట గ్రామానికి చెందిన మేడు దుల మమన్ యాదవ్ ఎన్నికయ్యారు. గతంలో కళాశాల అధ్యక్షు లుగా, ములుగు నగర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్య త్వం కలిగిన విద్యార్థి సంఘంలో పనిచేయడం గర్వకారణం అన్నా రు. గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థి పరిషత్ లో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ విద్యారంగ సమస్యల కోసం ఎన్నో ఉద్యమా లు చేసామని, ఏబీవీపీ పిలుపు మేరకు స్థానిక, రాష్ట్రస్థాయిలో విద్యారంగా సమస్యలపై పోరాట పటిమను గుర్తించి ఏబీవీపీ నేడు జరుగుతున్న జాతీయ మహాసభల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక చేశారని మమన్ యాదవ్ అన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ అనునిత్యం విద్యార్థుల కోసం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా నియమించినందు కు రాష్ట్ర శాఖకు ధన్యవాదములు తెలిపారు.