ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. 

Written by telangana jyothi

Published on:

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. 

  • భద్రాచలం బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ వెంకట్రావు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఉదయం కమ్మరి గూడెం ,బెస్తగూడెం మరికాల తో పాటు బర్లగూడెం లలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా కార్నర్ మీటింగ్ లు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత స్వగ్రామమైన మరికాల పంచాయతీ లో ,జి.పి. కేంద్రంలో బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు పర్యటించారు. గ్రామంలో అనేకమంది వివిధ పార్టీలకు చెందిన వారు బిఆర్ఎస్ లో చేరటంతో వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .ఈ సందర్భంగా డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మారు మూల ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలపరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబాల కు అందుతున్నాయని ,ప్రజలు ఈ ఒకసారి టిఆర్ఎస్ అభ్యర్థి గా తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలో అనేక పదవులు నిర్వహించిన నాయకులు తమస్వలాభాలకోసం అక్రమ ఆస్తులు సంపాదించుకొని ,ఇసుక ర్వాంపులు ,భూ కబ్జాలకు పాల్ఫడ్డారని ధ్వజమెత్తారు. వ్యక్తిగత స్వార్థాల కోసం పార్టీ లు మారుతున్న నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం ఓటర్లకు పిలుపు నిచ్చారు. వెంకటాపురం మండల పార్టీ అధ్యక్షులు గంప రాంబాబు కార్నర్ మీటింగ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించారు. వెంకటాపురం, వాజేడు టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార కో కన్వీనర్ సీనియర్ నాయకులు గొడవర్తి నరసింహమూర్తి మాట్లాడుతూ పార్టీలను అడ్డుపెట్టుకొని అక్రమ సంపాదన చేసిన నాయకులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, దశాబ్దాల కాలంగా దోపిడీకి గురైన ఈ ప్రాంత ప్రజలు మేల్కొని బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ వెంకటరావును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు .అభ్యర్థి డాక్టర్ ను గెలిపించుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై అనేక అవినీతి ఆరోపణలను గుప్పించారు. పార్టీలు మారిన నాయకులపై ఆరోపణలు గుప్పించారు. మండల పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు అధ్యక్షతన కార్న్ ర్ మీటింగ్ లు జరిగాయి. మరి కాల గ్రామ పొలిమేరలకు వచ్చిన ఎన్నికల ప్రచార రథాలకు, మరి కాల గ్రామస్తులు, అనేకమంది మహిళలు ప్రజలు జై టిఆర్ఎస్ జై కేసీఆర్, కారు గుర్తుకే మన ఓటు వేద్దాం. డాక్టర్ ను గెలిపించుకుందాం అంటూ నినాదాలు చేస్తూ, గ్రామ మధ్యలోనే ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు .ఈ సందర్భంగా అనేకమంది టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో, వారందరికీ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. బెస్తగూడెం గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారం, కార్నర్ మీటింగ్లలో బిజెపి పార్టీ కి చెందిన ఎంపిటిసి రామెళ్ళ లక్షి ల బిజెపికి రాజీనామా చేసి పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు టిఆర్ఎస్ నేతల సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ప్రజా ప్రతినిధి అయిన ఎంపిటిసి రామలక్ష్మి ని పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు .కమ్మరి గూడెం, బెస్తగూడెం, దళిత కాలనీ, లక్ష్మీనగరం, మరికల, బర్లగూడెం గ్రామాలతో పాటు వెంకటాపురం మండల కేంద్రంలోని మార్కెట్ సెంటర్, బస్టాండ్ సెంటర్, ప్రధాన వీధులలో దుకాణాలలో పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు పార్టీ నేతలు షాపులు యజమానులు ను కలసి ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అనేకమంది పార్టీ అభ్యర్థి డాక్టర్ కు స్వాగతం పలుకుతూ పార్టీ కరపత్రాలను స్వీకరించి, ఈసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటామని ఒటర్లు జై టిఆర్ఎస్, జై జై టిఆర్ఎస్ అంటూ స్వాగతం పలికారు .ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంప రాంబాబు,ఎంపి.పి. చెరుకూరి సతీష్ కుమార్, ఎన్నికల ప్రచార కన్వీనర్ గుడవర్తి నరసింహమూర్తి ,చింతల శ్రీను ,ఎంపీటీసీ .రామ లక్ష్మీ,శేఖర్ పార్టీ సర్పంచులు తో పాటు, నేతలు మడుంబా శ్రీను ,పార్టీ ప్రజా ప్రతినిధులు పలువురు పెద్ద సంఖ్యలో ఇంటింటి ప్రచారం, కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. ఎటువంటి గొడవలు జరగకుండా వెంకటాపురం ఎస్ఐ ఆర్. అశోక్ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now