అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఇసుక లారీ : ఒకరు మృతి
- క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్
తెలంగాణ జ్యోతి, ఏటూరు నాగారం ప్రతినిధి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామ సమీపంలోని 163 జాతీయ రహదారి పై ఇసుక లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. గమనించిన ప్రయాణికులు విషయాన్ని ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా సీఐ రాజు, ఎస్ఐ కృష్ణ ప్రసాద్ లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని జెసిబి సహాయంతో డ్రైవర్ను బయటకు తీశారు. లారి స్టీరింగ్ సమస్య తో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.