అజ్ఞాత మావోయిస్టు కుటుంబానికి దుస్తులు, బియ్యం పంపిణీ
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాటారం మండలం దస్తగిరిపల్లి లో నివాసం ఉంటున్న అజ్ఞాత మావోయిస్ట్ అన్నె సంతోష్ కుటుంబ సభ్యులకు ఆదివారం ఎస్సై మ్యాక అభినవ్ దుస్తులు, నిత్యావసర వస్తువులు అందించారు. కాటారం మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన అజ్ఞాత మావోయిస్టు ఆన్నే సంతోష్ గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబ సభ్యులను వదిలి మావోయిస్టు పార్టీలోకి వెళ్లి పనిచేస్తున్నాడు, దీంతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా అజ్ఞాత మావోయిస్టు సంతోష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎస్ఐ అభినవ్ మాట్లాడుతూ అజ్ఞాత మావోయిస్టులు సాధించేది ఏమి లేదని, సంతోష్ ఎక్కడ ఉన్న జనజీవన స్రవంతిలో కలసి, ప్రశాంత జీవనం గడపాలని అన్నారు. తన పై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం మావోయిస్ట్ పార్టీని వీడి లొంగిపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటారం రెండవ ఎస్ఐ సురేష్, శిక్షణ ఎస్ఐ ప్రసాద్, గ్రామస్తులు ఐలి రాజబాబు, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.