అంకన్నగూడెం బస్సుసర్వీస్ లను పాత పద్ధతిలోనే నడిపించాలి.
ములుగు ప్రతినిధి : అంకన్నగూడెం బస్సు సర్వీస్ లను పాత పద్ధతి (పాత సమయం )లోనే, వేరే గ్రామాలకు లింక్ పెట్టకుండా నడిపించాలని సిపిఎం ఆధ్వర్యంలో రాయినిగూడెం బస్టాండ్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం ఏజెన్సీ ఏరియా నాయకులు గుండెబోయిన రవిగౌడ్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడు తు ఏజెన్సీ గ్రామాల పై ఆర్టీసీ అధికారులు ఇష్టం వచ్చినట్లు సమయాలు మార్చుతూ ప్రయాణికులు ప్రయివేట్ వాహనాలు ఎక్కేలా చేస్తున్నారని రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజుల క్రితం ములుగు మండలం ఇంచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని బరిగలోనిపల్లి గ్రామం నుండి బండారు పల్లి మాడల్ స్కూల్ కు ఉదయం 8 గంటలకు, ములుగు నుండి అంకన్నగూడెం వచ్చే సర్వీస్ ను లింక్ చేశారన్నారు. దీని వలన రాయినిగూడెం ఆశ్రమ పాఠశాల, రాయినిగూడెం పీహెచ్సీ వైద్య సిబ్బంది, సర్వాపూర్ వాణి విద్యానికేతన్ పాఠశాలకు వచ్చే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 8 గ్రామపంచాయతీ ల పరిది 20 గ్రామాల ప్రజలు ఈ బస్సు సౌకర్యం పొందుతూన్నారన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు మానవతా దృక్పధం తో అలోచించి బరిగలోని పల్లి విద్యార్థుల కు వేరే బస్సు ఏర్పాటు చేసి అంకన్నగూడెం బస్సు సర్వీస్ లను యధావిధిగా నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో గుట్ట మీది ముసలయ్య ఆలయ ప్రచార కార్యదర్శి గుండమీది వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి దేవేందర్ రావు, కల్తీ నవీన్ స్వామి, తవిటి సమ్మయ్య, వజ్జ పాపయ్య, తవిటి పాపయ్య, తిరుపతి, తిరుపతయ్య, ఆగబోయిన పాపయ్య, పత్రి సాంబయ్య, లక్ష్మి, పూజారి సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.