🌹 🌹 ॐ నేటి రాశి ఫలాలు ॐ 🌹 🌹
🌞 *_జనవరి 3, 2025_* 🌝
*శ్రీ క్రోధి నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*హేమంత ఋతువు*
*పుష్య మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *చవితి* రా12.53
వారం: *భృగువాసరే*
(శుక్రవారం)
నక్షత్రం: *ధనిష్ఠ* రా12.00
యోగం: *వజ్రం* మ2.40
కరణం: *వణిజ* మ1.36
&*విష్ఠి* రా12.53
వర్జ్యం: శేష వర్జ్యం *ఉ. 6.10*
దుర్ముహూర్తము: *ఉ8.47-9.31*
&*మ12.26-1.10*
అమృతకాలం: *మ1.56-3.29*
రాహుకాలం: *ఉ10.30-12.00*
యమగండం: *మ3.00-4.30*
సూర్యరాశి: *ధనుస్సు*
చంద్రరాశి: *మకరం*
సూర్యోదయం: *6.36*
సూర్యాస్తమయం: *5.34*
మేషం : నూతన విద్యవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహా రాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగు తారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి. ఆర్ధికంగా అభి వృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపా రాలు అనుకూలంగా సాగుతాయి.
వృషభం : చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆపులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సాగుతాయి.
మిధునం : దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలరు. ఆరోగ్య పరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. ఉద్యోగపరంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది.
కర్కాటకం : ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లబ్ది పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్ర మాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
సింహం : ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలం లో పూర్తి చేసి పై వారి నుండి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరప్రాంతాల వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.
కన్య : సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి, ముఖ్య మైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు వలన లాభం పొందుతారు. ధనదాయం బాగుంటుంది. అనారోగ్య సూచన లున్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
తుల : వృత్తి ఉద్యోగ విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తా రు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమ యానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు పరంగా నష్టాల నుండి బయటపడతారు. గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
వృశ్చికం:అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుం ది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
ధనస్సు : వ్యాపార పరంగా ఇబ్బందులు తొలగుతాయి, ధన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.
మకరం : ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహా రాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. రుణ బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి పడగలుగుతారు. బయట
కుంభం : సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తా యి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది.
మీనం : ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నేత్ర సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి. By.. km…
*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🪷🇮🇳🚩🙏🚩🇮🇳🪷
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉